
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజన్నను దర్శించుకునేందుకు తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దీంతో క్యూలైన్ కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి సుమారు 4గంటల సమయం పడుతోంది. స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు భక్తులు. ఉదయాన్నే స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు.