
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, పాస్టర్లు దైవసందేశాన్ని అందించి భక్తులను దీవించారు.
మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు