బాసర సరస్వతి ఆలయం వద్ద పేలుడు.. పరుగులు పెట్టిన భక్తులు

బాసర సరస్వతి ఆలయం వద్ద పేలుడు.. పరుగులు పెట్టిన భక్తులు

నిర్మల్: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద భారీ పేలుడుతో భక్తులు పరుగులు పెట్టారు.అమ్మవారి గర్భగుడి ప్రాంతలో నూతన కార్యాలయం నిర్మాణ పనుల్లో భాగంగా జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి బండరాళ్లను పేల్చారు. దీంతో పెద్ద పెద్ద బండరాళ్లు చెల్లా చెదురై గాల్లోకి లేచి రాళ్ల ముక్కలు పక్క ను బిల్డింగ్, పార్కింగ్ చేసిన కార్లపై పడ్డాయి. పేలుడు ధాటికి రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

ఆదివారం సెలవు దినం కావడంతో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు పెట్టారు. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.