తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు

గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. పెరటాసి మాసం ముగుస్తుండటం, వీకెంట్ కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 30 గంటల టైం పడుతోంది. కంపార్టుమెంట్లతో పాటు.. టీడీటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లు కూడా నిండిపోయాయి.

దీంతో క్యూ లైన్లు గోగర్భ డ్యాం వరకు చేరుకున్నాయి. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు నిన్న 79 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 4 కోట్ల 25 లక్షల రూపాయల హుండి ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.