తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది

తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది
  • ఫ్యామిలీని తప్ప పాలనను పట్టించుకుంటలే...
  • తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది
  •  కేంద్ర మంత్రి దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిన్హ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి/రాజాపేట, వెలుగు : తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన సాగుతోందని కేంద్ర కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహాయమంత్రి దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిన్హ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. తమ కుటుంబం కోసం తప్ప పేదల గురించి ఆలోచించడం లేదన్నారు. భువనగిరి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో పర్యటన సందర్భంగా సోమవారం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో చేనేత కార్మికులు, ఆలేరులో బీజేపీ అనుబంధ లీడర్లు, వలిగొండలో రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేనేతపై జీఎస్టీ తొలగించాలని, కార్మికులకు ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ వర్తింపజేయాలని రఘునాథపురం సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిపల్లి శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత అద్భుతమైన హస్త కళ అని, చేనేతపై జీఎస్టీ అంశం, కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

కేంద్రం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన, సురక్ష, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి వంటి స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం మద్దతు ధరను పెంచామని, డీఏపీ, ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ అనుబంధ సంఘాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. వచ్చే నెల 15లోగా కమిటీల కూర్పు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రఘునాథపురంలో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అంతకుముందు భువనగిరి పోస్టాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. 

నరసింహుడిని దర్శించుకున్న కేంద్రమంత్రి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సోమవారం కేంద్ర మంత్రి దేవ్ సిన్హ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకుడు నల్లంథీగళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనర్సింహాచార్యులు వేదాశీర్వచనం చేయగా ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం, శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు.