దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో సిబ్బంది

దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో సిబ్బంది

దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఫ్లైట్ లోకి అనుమతించకపోవడంపై ఇండిగో ఎయిర్ లైన్స్ కు DGCA రూ.5లక్షల ఫైన్ విధించింది. రాంచీ ఎయిర్ పోర్ట్ లో.. ఈ నెల 7న తోటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని దివ్యాంగుడైన చిన్నారిని, అతని ఫ్యామిలీ మెంబర్స్ ను బోర్డింగ్ కు అనుమతించలేదు. చిన్నారిని విమానం ఎక్కేందుకు అనుమతించేందుకు గ్రౌండ్ స్టాఫ్ నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి, దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణలో ఇండిగో యాజమాన్యానిదే తప్పని తేల్చారు. 5 లక్షల ఫైన్ తో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్ ఏరియాలో యువకుడు భయాందోళనకు గురయ్యాడని..ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే తమ సిబ్బంది కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

మరిన్ని వార్తల కోసం

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్