మావో ప్రభావిత జిల్లాల సీనియర్ ఐపీఎస్ లతో డీజీపీ సమీక్ష

మావో ప్రభావిత జిల్లాల సీనియర్ ఐపీఎస్ లతో  డీజీపీ సమీక్ష

ములుగు జిల్లా : రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి చెందిన కొంతమంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలోని 130 మంది తెలంగాణలో ఉన్నారని, వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. పోలీసుల ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను అందిస్తామని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల పోలీసు అధికారుల సేవలు బాగున్నాయని కితాబునిచ్చారు.

ములుగు జిల్లా వెంకటపూర్ లో నాలుగు జిల్లాలకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై జరిగిన ఈ సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి డీఐజీ నాగిరెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారులు హాజరయ్యారు.