మావోయిస్టుల ఏరివేతకు జాయింట్​ ఆపరేషన్​

మావోయిస్టుల ఏరివేతకు జాయింట్​ ఆపరేషన్​
  • వెంకటాపురంలో పోలీస్ ఆఫీసర్లతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశం

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: రాష్ట్రంలోకి చొరబడే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ‒చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దున గల ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ లో బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వెంకటాపురం చేరుకున్న ఆయన ఇక్కడ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఐజీ టి.ప్రభాకర్, గ్రేహౌండ్స్ డీజీ కె. శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీజీ నాగిరెడ్డితో కలిసి పోలీస్ ఆఫీసర్లతో మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా కొనసాగిస్తామన్నారు. సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు  కొనసాగుతాయన్నారు. మావోయిస్టు పార్టీలో చాలామంది అజ్ఞాతంలో ఉన్నారని, వీరిలో 130 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని చెప్పారు. కేంద్ర కమిటీలో 20 మంది ఉండగా 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారన్నారు. అడవులను పట్టుకొని తిరుగుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసుల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. సమావేశంలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లా ఎస్పీలు సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సంగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రపవార్, వినీత్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటెలిజెన్స్​ హెచ్చరికలతోనే..

మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర కమిటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అతి ముఖ్యమైన మావోయిస్టు ప్రతినిధులకు ఈ కమిటీలో అవకాశం కల్పించింది. కమిటీలో 20 మంది ఉండగా వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులే ఉన్నట్లుగా జాతీయ నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చాయి. అంతేకాకుండా ఆగస్టు నెలలో తెలంగాణ‒చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్- బస్తర్ జిల్లాల అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు వారం రోజులు నిర్వహించారు. వేలాది మంది మావోయిస్టులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులంతా పాల్గొన్నట్లు రాష్ట్ర పోలీసులకు పక్కా సమాచారం అందింది. కొత్త కేంద్ర కమిటీలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో ఏదో విధంగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కరోనా కారణంగా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పాటు మరికొందరు మృతి చెందగా.. వివిధ అనారోగ్య కారణాలతో కొందరు అగ్రనాయకులు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వారినుంచి పోలీసులు కీలకమైన సమాచారం సేకరించారు. మావోయిస్టులు రాష్ట్రంలో అడుగు పెడితే వారికి  చెక్ పెట్టే విధంగా ప్లాన్​ చేస్తున్నారు.

జవాన్ల సమస్యలు పరిష్కరిస్తాం

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల అటవీ గ్రామం పూసుగుప్పలో డీజీపీ మహేందర్​రెడ్డి బుధవారం పర్యటించారు.హెలికాప్టర్​ ద్వారా పూసుగుప్పకు చేరుకున్న డీజీపీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ​బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న సీఆర్పీఎఫ్​ క్యాంపును ఆయన సందర్శించారు. సీఆర్పీఎఫ్​ జవాన్ల వసతి సౌకర్యాలను పరిశీలించారు. జవాన్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడంలో భద్రాద్రి జిల్లా పోలీసుల సేవలను అభినందించారు.అనంతరం పూసుగుప్ప నుంచి హెలికాప్టర్​లో ములుగు జిల్లా వెంకటాపురానికి వెళ్లారు.