ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు సస్పెండ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు సస్పెండ్

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. 48 గంటలుగా పోలీసుల అదుపులో ఉండడంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భుజంగరావు, తిరుతపన్నలు ఇద్దరు కస్టడీ విచారణ ఎదుకొంటున్నారు.
 
రెండో రోజైన శనివారమూ ఈ ఇద్దరినీ పోలీసులు విచారిస్తూ.. వారి స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేస్తున్నారు. ఇక, నిన్న అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనను విచారించడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతుందని సమాచారం. కాగా,  రాధా కిషన్ ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా మరో ఇద్దరి  ప్రవేయంపైనా పోలీసులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరా ఇద్దరు?.. ఫోన్ల ట్యాపింగ్ లో వాళ్ల రోల్ ఏమిటి అన్నది త్వరలోనే తేలనుంది.