మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' ట్రైలర్

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' ట్రైలర్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమాకా'. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. 'కోట్లలో ఒకడాడు.. కొడితే కోలుకోలేవు' అనే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తిరేపుతోంది. 'నేను వెనకున్నవాళ్లను చూసుకుని ముందుకొచ్చినోణ్ని కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అన్ని ఎగ్జామ్ పుల్ సెట్ చేసినవాడిని' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.