దమ్మాయి గూడచిన్నారి మృతి.. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?

దమ్మాయి గూడచిన్నారి మృతి.. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే చిన్నారి ఒంటిపై గాయాలుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి  మృతిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సమయానికి స్పందించలేదని ఆరోపిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?

గురువారం ఉదయం 9 : 20 గంటల సమయంలో బాలికను తండ్రి స్కూల్ వద్ద డ్రాప్ చేశాడు. అనంతరం చిన్నారి పార్కుకు వెళ్దామని స్నేహితులతో చెప్పగా వారు నిరాకరించారు. దీంతో చిన్నారి క్లాస్ రూంలోనే బ్యాగు పెట్టి స్కూల్ నుంచి బయటకు వచ్చింది. ఉదయం 10.20 గంటలకు టీచర్ అటెండెన్స్ తీసుకోగా.. బాలిక మిస్సైనట్లు గుర్తించారు. బ్యాగు క్లాస్ రూంలోనే ఉండటంతో టీచర్లు స్కూల్ పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.

https://www.youtube.com/watch?v=YObFBKTZoEE