తిరుమలలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు..

తిరుమలలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు..

తిరుపతిలో డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 16 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల కార్యక్రమం నిత్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. ధనుర్మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారని తెలిపింది టీటీడీ.  టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఏపీలో  76, తెలంగాణ  57, త‌మిళ‌నాడు- 73, క‌ర్ణాట‌క‌- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలో కూడా ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం. 

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారని... ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుందని అంటున్నారు. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో ఉంది. 

ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ వ్రతం ఒక్కరుగా కాకుండా అందరినీ కలుపుకొని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని చెబుతున్నారు పండితులు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది టీటీడీ.