
డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ 51వ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున (Nagarjuna) విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. "DNS' అనే వర్కింగ్ టైటిల్తో ఇవాళ (జనవరి 18) పూజా ఈవెంట్ను జరుపుకుంది చిత్ర బృందం.
ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ తో పాటు ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావ్, భరత్ నారంగ్ తదితరులు అటెండ్ అయ్యారు. కాగా హీరో ధనుష్తో పాటు నటీనటులపై పలు కీలకమైన సీన్స్ నిన్న (బుధవారం) ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ పూజా ఈవెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో శేఖర్ కమ్ముల చూపించిన స్టోరీ కాన్సెప్ట్ ను రివీల్ చేశాడు. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు..ఎంతో ఖరీదైన భారీ బిల్డింగులు..మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడలు..ఈ రెండింటి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని' చూపించిన పోస్టర్ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంది.
శేఖర్ కమ్ముల మరోసారి సమాజాన్ని ప్రశ్నించేలా..సోసైటీలో అసమానతల్ని ఎత్తి చూపుతూ తనదైన మార్క్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.
A blockbuster voyage that's bound to resonate with the nation! ?#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule ?
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
ధనుష్ కెప్టెన్ మిల్లర్, నాగార్జున నా సామిరంగ సినిమాలతో ఈ సంక్రాంతికి అలరిస్తున్నారు. దీంతో మంచి సక్సెస్ జోష్లో ఉన్న ఈ కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది.
'DNS'..ధనుష్..నాగార్జున..శేఖర్ కమ్ముల..ఈ ముగ్గురి కలయికలో వస్తోన్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.