
ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘రాయన్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక పాటతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటకు చంద్రబోస్ పవర్‌ఫుల్ లిరిక్స్ రాశారు. ‘తలవంచి ఎరగడే.. తలదించి నడవడే.. తలపడితే వదలడే.. తనపేరు విజయుడే.. ప్రాణం పోతున్నా.. వస్తున్నా.. పొగరు వీడడు వీడే.. దూరం వెళ్లండి వెళ్లండి.. వచ్చాడు నిప్పై వీడే’
అంటూ సాగిన పాటతో సినిమాలోని ధనుష్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. హేమచంద్ర, శరత్ సంతోష్ కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీలో ధనుష్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. నిత్యామీనన్, అనిఖా సురేంద్రన్ ఇందులో హీరోయిన్స్.
సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా జూన్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఏషియన్, సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా తెలుగులో విడుదలవుతోంది.