
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘రాయన్’(RAAYAN). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జూలై 26న థియేటర్లలో రిలీజ్ అయింది.
ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్ థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ తో ధనుష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాయన్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పెట్టేసింది టీమ్.
ఈ మూవీ ఆగస్టు 23 నుంచి ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని పోస్టర్ ద్వారా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో రాయన్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఈ చిత్రంలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్, ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది.
Raayan has a PURPOSE to fulfill and JUSTICE to seek ⚖️?#RaayanOnPrime, Aug 23@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/1I3mqFw0GR
— prime video IN (@PrimeVideoIN) August 16, 2024
కథేంటంటే:
కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. టౌన్‌కి వెళ్లొస్తామని చెప్పి మళ్లీ ఇంటికి తిరిగిరారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్), చెల్లి (దుషారా విజయన్)తో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని సాఫీగా బతికేస్తుంటాడు. అతడి పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్) పదే పదే గొడవలకు వెళ్తూ సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. రాయన్ కు మాత్రం గొడవలంటే అస్సలు నచ్చదు. ఏ పరిస్థితుల్లో అయినా సంయమనం పాటిస్తూ గొడవలకు దూరంగా ఉండాలని తమ్ముళ్లిద్దరినీ ఎప్పుడు వారిస్తూ ఉంటాడు. వీరు నివసించే టౌన్ లోనే దురై (శరవణన్), సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్స్ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఈ గూండాలు దురై, సేతు వల్ల కాతవరాయన్ జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే..రాయన్‌ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్ ఏం చేశాడు? రాయన్ కోసం వాళ్లు ఏం చేశారు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.