కేసీఆర్​కు ధరణి భస్మాసుర హస్తం

కేసీఆర్​కు ధరణి భస్మాసుర హస్తం
  • సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​కు ధరణి భస్మాసుర హస్తంలా తయారయ్యిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ధరణితో పేద రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దానివల్ల అసలైన రైతులకు రైతుబంధు రాలేదని ఆరోపించారు. సాయమంతా భూస్వాములకే వెళ్లిపోయిందన్నారు. అందుకే ప్రతి ఊర్లోనూ రైతులు బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పారని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 

"ధరణితో  చాలా మందికి అడ్డదారుల్లో భూములు వెళ్లాయి. తప్పులను కరెక్ట్​ చేసే వ్యవస్థ కలెక్టర్​ వద్ద కూడా లేదు. దీంతో కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ధరణితో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. సమగ్ర భూ సర్వే చేయకుండానే ధరణి పేరుతో లోపాల సర్వే చేయడంతో లొసుగులు అలాగే ఉండిపోయాయి. ఒకప్పుడు వీఆర్ఏ, వీఆర్వో, జాయింట్​ కలెక్టర్​ లెవెల్స్​లో క్రాస్​ చెకింగ్స్​ఉండేవి. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి. కొత్తగూడెంలో 76 జీవోను తొలగించాలి" అని ప్రభుత్వానికి కూనంనేని రిక్వెస్ట్ చేశారు.