ఎన్నాళ్లు ఈ అద్దె తిప్పలు? డబుల్ బెడ్ రూమ్ లు ఎప్పుడు కేటాయిస్తరు?

ఎన్నాళ్లు ఈ అద్దె తిప్పలు? డబుల్ బెడ్ రూమ్ లు ఎప్పుడు కేటాయిస్తరు?

అద్దె ఇంట్లో ఉండలేకపోతున్నామని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెల అద్దె కోసం వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయాలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. మీ సేవకి వెళ్లి ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా.. డబ్బులు వృద్ధా అవుతున్నాయే తప్ప ఇండ్లు మాత్రం రావటం లేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం కలెక్టర్ ఆఫీస్ లో దాఖలు చేసిన 3 లక్షల దరఖాస్తులను తక్షణమే సర్వే చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తులను సర్వే చేయాలని లబ్ధిదారులు కోరారు. 

ALSO READ :అయ్యో.. అయ్యయ్యో.. : మాజీ సీఎం OSD ఆగలేకపోయాడు.. రూ.7 లక్షలు కొట్టేశారు

సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. ఇప్పటివరకు ఇండ్లు, భూములు ఉన్నవారికే డబుల్ బెడ్ రూమ్ లను కేటాయిస్తున్నారే తప్ప.. పేద ప్రజలకు మాత్రం ఇండ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇకనుంచి అయినా ప్రభుత్వం సర్వే చేసి.. భూములు, ఇండ్లు లేనివారికి గుర్తించి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరారు. 

లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ కలసి లబ్ధిదారులు  ధర్నా చేపట్టారు. హైదరాబాద్ లక్డికపూల్ కలెక్టరేట్ కార్యాలయం గేట్ ముందు బైఠాయించారు. డబుల్ బెడ్ రూమ్ ల కోసం దాఖలు చేసిన వారందరికీ వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు కల్పించారు.