తొలగించిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలని..

 తొలగించిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలని..

కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో దళిత సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పు కోసం తీసి పక్కన పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం పునః ప్రతిష్ట కసం మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు.