మెదక్ జిల్లా వల్లూరు దగ్గర బ్రిడ్జి నిర్మించాలని ధర్నా

మెదక్ జిల్లా వల్లూరు దగ్గర బ్రిడ్జి నిర్మించాలని ధర్నా

మెదక్​, చేగుంట, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్​జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు హైవేపై మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న నార్సింగ్ ఎస్సై సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

‘వార్డులో పనులు చేయకపోతే అందరి పేర్లు రాసి చనిపోతా’

మెదక్​ టౌన్​, వెలుగు: ‘తన వార్డులో పనులు చేయకపోతే.. అందరి పేర్లు రాసి నేను చనిపోతా’ అని మెదక్​ మున్సిపల్​ 17వ వార్డు కౌన్సిలర్​ భుజిరంపేట అరుణ అధికారులను హెచ్చరించారు. మెదక్​మున్సిపల్​ జనరల్​ బాడీ మీటింగ్​మంగళవారం చైర్‌‌‌‌పర్సన్​ రాధిక భూపతి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్‌‌లో కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. కౌన్సిలర్​ అరుణ మాట్లాడుతూవార్డులో తనను పట్టించుకోకుండా గతంలో పని చేసిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారని వాపోయారు.

తాము ప్రజల కోసం పని చేస్తున్నామని వార్డులో పనులు చేయకపోతే మీ అందరి పేర్లు రాసి చనిపోతానని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చైర్‌‌‌‌పర్సన్‌‌ రాధిక స్పందిస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యమిస్తున్నామని, కొంచె ఓపిక పట్టాలని సముదాయించారు. పలు సమస్యలపై కౌన్సిలర్లు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వైస్​ చైర్మన్‌‌ నరేశ్‌‌గౌడ్‌‌ డీఈ మహేశ్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరిగిన ధరలపై విపక్షాల గర్జన
వనపర్తి/ వంగూరు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలను ముంచుతోందని, దేశాన్ని రాబందుల రాజ్యంగా మారుస్తోందని విమర్శించారు. వంగూరు మండలం రంగాపూర్‌‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.