
న్యూఢిల్లీ: ఐపీఎల్ 15వ సీజన్ మెగా ఆక్షన్ లో పాల్గొనే ప్లేయర్ల లెక్క తేలింది. మొత్తం 590 ప్లేయర్లతో కూడిన ఫైనల్ లిస్టును బీసీసీఐ మంగళవారం రిలీజ్ చేసింది. ఇందులో 370 మంది ఇండియా ప్లేయర్లు, ఫారిన్ నుంచి 220 మంది ఉన్నారు. ఓవరాల్‌గా 228 మంది క్యాప్డ్, 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు, ఐసీసీ అసోసియేటెడ్ దేశాల నుంచి ఏడుగురు క్రికెటర్లు బెంగళూరులో ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే మెగా ఆక్షన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలం కోసం పలు దేశాల నుంచి 1,214 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు ఇంట్రస్ట్ చూపని క్రికెటర్ల పేర్లను తొలగించి తుది జాబితాను రిలీజ్ చేశారు. హయ్యెస్ట్‌గా రూ.2 కోట్ల ప్రైస్ లిస్టులో 48 మంది ఉండగా, రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్ లో 20 మంది, రూ. కోటి బేస్ ప్రైస్‌లో 34 మంది పోటీలో నిలిచారు. రెండు కోట్ల బేస్‌ప్రైజ్‌లో ఇండియా టాప్ ప్లేయర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, షమీ, భువనేశ్వర్, ఉమేశ్, ఇషాంత్, అశ్విన్..ఫారిన్ నుంచి ప్యాట్ కమిన్స్, రబాడ మరికొందరు ప్లేయర్లు రూ.2 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో ఉన్నారు. ఇండియా నుంచి శ్రేయస్, ధవన్‌తో పాటు ఇండియా యంగ్‌స్టర్స్ ఇషాన్, పడిక్కల్, హర్షల్, షారుక్ ఖాన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడే చాన్సుంది.