ఏ..! నీ రూమ్ లో ఉండే నువ్వు.. నా రూమ్ లో ఉండలేవా!!.. హైపర్ ఆది

ఏ..! నీ రూమ్ లో ఉండే నువ్వు.. నా రూమ్ లో ఉండలేవా!!.. హైపర్ ఆది

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్నికొన్నాళ్లుగా నవ్విస్తున్న హైపర్ ఆది(Hyper Aadi) స్కిట్స్ చాలా ఫేమస్. ఇప్పుడు అతను ఏం మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా హైపర్ ఆది ‘ఢీ’ షో ప్రోమో(Dhee latest promo)లో..బ్రహ్మానందంను ఇమిటేట్ చేస్తూ రిలీజ్ అయినా ప్రోమో అందరికీ షాక్ ఇస్తుంది.  

ఈ షోలో ఫస్ట్  యాంకర్ దీపిక పిల్లి(Anchor Deepika Pilli).. నలుపు నేరేడంటి..కళ్ళలోన నువ్వే అందగాడా..అంటూ సాంగ్ పాడింది.హైపర్ ఆది వెంటనే లేస్తూ.. బ్రహ్మీ స్టైల్ ను ఇమిటేట్ చేశారు. స్టాప్ ఇట్..నువ్వు ఎంచుకున్న రాగమేంటి? తీసుకున్న తాలమేంటి? తకిట తకిట తా 304, తకధిమి తకధిమి 305, ఏ నీ రూమ్ లో ఉండే నువ్వు.. నా రూమ్ లో ఉండలేవా? అంటూ కౌంటర్లు వేశారు ఆది.

దీంతో షోలో ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుతు..షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ అవుతుంది. యాంకర్ దీపిక పిల్లికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ . దీపిక ఒక్క ఫొటో పెడితే చాలు.. లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి. అందులోనూ ఈ మధ్య గ్లామర్ కాస్త ఎక్కువే కనిపిస్తోంది..దీంతో ఫ్యాన్స్ అంతా దీపికకు ఫిదా అయిపోతున్నారు.

ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌ షోలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ మితిమీరిన డైలాగ్స్ తో, షో అనేది ఉండకూడదని నెటిజన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు. ఇండియన్‌‌‌‌ టీవీ స్క్రీన్‌‌‌‌పై సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ రియాలిటీ షోస్‌‌‌‌లలో  ‘ఢీ’ షో ఎంతో స్పెషల్. ఇక్కడి నుంచే చాలా మంది కొరియోగ్రాఫర్లు సినీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.