
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి చిత్రాల తర్వాత లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ధీర’. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌ను బట్టి ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.
‘ప్రపంచమంతా కమర్షియల్‌గా ఉంటే నన్ను కమర్షియల్ అంటావేంటి’ అనే డైలాగ్‌తో హీరో పాత్ర ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ‘అంబులెన్స్ వెనకొస్తే సైడ్ ఇవ్వాలి.. నాలాంటోడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి.. కాదని గెలికితే.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్త’ లాంటి పంచ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.