
క్రికెటర్ ఎం.ఎస్ ధోని.. తన భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ స్థాపించి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుండి వస్తున్న మొదటి చిత్రం ‘ఎల్.జి.ఎం’ (లవ్ గెట్స్ మ్యారీడ్). రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని చెప్పారు. త్వరలోనే ట్రైలర్, ఆడియో రిలీజ్ చేస్తామన్నారు. హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా టైటిల్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రంలో యోగి బాబు, మిర్చి విజయ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.