IPL 2023: ధోనీకి గాయం.. రేపటి మ్యాచుకు దూరం! 

IPL 2023: ధోనీకి గాయం.. రేపటి మ్యాచుకు దూరం! 

రేపటి నుంచి ఐపీఎల్ పోరు మొదలవబోతోంది. తొలి ఫైట్ కు ఢిపెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో సీఎస్కేకు ఊహించని షాక్ తగిలింది. సీఎస్కే జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గాయమైనట్లు తెలుస్తోంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ధోనీ ఎడమ కాలికి బంతి బలంగా తాకింది. దాంతో గాయమైన ధోనీని మేనేజ్మెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ నేపథ్యంలో రేపు గుజరాత్ తో జరిగే తొలి మ్యాచ్ కు ధోనీ  అందుబాటులో ఉండడని సమాచారం. 

ధోనికి గాయమైందన్న వార్త వినగానే సీఎస్కే ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది. ధోనికి నిజంగానే గాయమైందా? కేవలం మొదటి మ్యాచ్ కు మాత్రమే దూరంగా కానున్నాడా? మిగతా మ్యాచ్ ల పరిస్థితి ఏంట?ని ఆవేదన చెందుతున్నారు అభిమానులు. కాగా, ధోనీ గాయంపై సీఎస్కే మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ వార్తపై సాయంత్రం జరిగే ప్రెస్మీట్ లో క్లారిటీ రానుంది.

ప్రస్తుతం బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ అందుబాటులో ఉన్నాడు కాబట్టి నాయకత్వానికి ఇబ్బంది లేకపోవచ్చు. అయితే, మోకాలి గాయం వల్ల స్టోక్స్‌‌‌‌ కేవలం బ్యాటర్‌‌‌‌గానే బరిలోకి దిగుతుండటంతో కెప్టెన్సీ పెద్ద భారం కాకపోవచ్చు. కీపర్‌‌‌‌గా అంబటి రాయుడు, డేవన్‌‌‌‌ కాన్వే, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌లో ఒకర్ని తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్‌‌‌‌గా చివరి ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌ తర్వాత మహీపై తుది నిర్ణయం తీసుకునే చాన్సెస్‌‌‌‌ ఉన్నాయి.