ఎక్సర్​సైజ్​ చేస్తే కంట్రోల్​లోకి షుగర్

ఎక్సర్​సైజ్​ చేస్తే కంట్రోల్​లోకి షుగర్

డయాబెటిస్​ కంట్రోల్​లో ఉండాలంటే  చక్కెర తగ్గించడం ఒక్కటే కాదు రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే టైప్​–1, టైప్​–2 డయాబెటిస్​ బారినపడతారు. అంతేకాదు గుండెజబ్బులు, చూపు తగ్గడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్లు వారానికి రెండున్నర గంటల సేపు ఎక్సర్​సైజ్​ చేయాలి. స్ట్రెంగ్త్​ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తే ఇన్సులిన్​ సెన్సిటివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్​. 

డయాబెటిస్​ ఉన్నవాళ్లు... నడవడం, సైకిల్ తొక్కడం, ఈతకొట్టడం వంటి కార్డియో మెటబాలిక్ ఎక్సర్​సైజ్​లు చేయాలి. వారంలో ఐదురోజులు అరగంట చొప్పున ఈ ఎక్సర్​సైజ్​ చేస్తే షుగర్ కంట్రోల్​లో ఉంటుంది. అంతేకాదు ఫ్యాట్​తో పాటు బ్లడ్ ప్రెజర్​ కూడా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో కొందరు ఆఫీస్​లో గంటల కొద్దీ కూర్చొని పనిచేస్తుంటారు. అలాంటివాళ్లు మధ్యమధ్యలో ఐదు నిమిషాలు  బ్రేక్ తీసుకోవాలి. కొంచెం దూరం నడవాలి.

చక్కెర ఎంత ఉండాలంటే..

ఎక్సర్​సైజ్​కి ముందు గ్లూకోజ్ లెవల్స్ చెక్​ చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర శాతం140 నుంచి 180 మిల్లీగ్రామ్స్​​/డెసి లీటర్​ మధ్య ఉంటే ఎక్సర్​సైజ్​ చేయొచ్చు. అలాకాకుండా 90 మి.గ్రా​/డి.ఎల్ మాత్రమే ఉంటే 15 నుంచి 30 గ్రాముల చక్కెర తీసుకోవాలి. అందుకోసం యాపిల్ ముక్క లేదా అరటిపండు, రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష,  టేబుల్ స్పూన్ తేనె తినాలి. ఒకవేళ చక్కెర శాతం 70మి.గ్రా​/డిఎ.ల్ కంటే తక్కువ ఉంటే దాన్ని ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఇలాంటి పరిస్థితిలో చక్కెర శాతం మరింత తగ్గితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.  అందుకని వీళ్లు ఎక్సర్​సైజ్ చేసేముందు బిస్కెట్లు, బాదం పప్పు, వాల్​నట్స్ వంటివి తినాలి అంటున్నాడు ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ మహేష్​ చవాన్.