Diabetic Foot Care: ఈ సీజన్ లో హెల్దీ పాదాల కోసం సింపుల్ టిప్స్

Diabetic Foot Care: ఈ సీజన్ లో హెల్దీ పాదాల కోసం సింపుల్ టిప్స్

వర్షాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణం పాదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే, కొన్ని సాధారణ చిట్కాలతో, వర్షాకాలంలో మీ పాదాలను ఆరోగ్యంగా,  సురక్షితంగా ఉంచుకోవచ్చు.

సరైన బూట్లు ధరించండి..

డయాబెటిక్ ఫుట్ కేర్ విషయానికి వస్తే, పాదం ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కలిగి ఉన్న  షూలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అది కూడా సరిగ్గా సరిపోయే బూట్లు ధరించేలా చూసుకోండి. అందులోనూ వెడల్పాటి బొటనవేలు పెట్టెని కలిగి ఉండేలా చూసుకోండి. కాన్వాస్ లేదా లెదర్ వంటి పదార్థాలతో తయారు చేసిన బూట్లు ధరించడం చాలా ముఖ్యం. ఈ వర్షాకాలంలో ఫ్లిప్-ఫ్లాప్స్ లేదా చెప్పులు ధరించడం మానుకోండి. ఎందుకంటే ఇవి పాదానికి అనారోగ్యం కలగజేస్తాయి.

పాదాలపై శ్రద్ధ వహించండి..

ఎరుపు, వాపు, నొప్పి, కోతలు లేదా బొబ్బలు ఏవైనా ఉన్నాయా అని మీ పాదాలను తరచూ తనిఖీ చేయండి. అందుకోసం ప్రత్యేకంగా కొంత సమయం  కేటాయించండి. మీరు ఈ లక్షణాలలో ఏ ఒక్క సమస్యతో నైన ఇబ్బంది పడుతున్నట్టైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ సీజన్‌లో మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. రోజూ మీ పాదాలను గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో కడగడం అలవాటుగా చేసుకోండి. ఆ తర్వాత వాటిని బాగా ఆరబెట్టి, అవసరమైతే మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.

చెప్పులు లేకుండా నడవడం మానుకోండి..

వర్షాకాలంలో చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. ఎందుకంటే నేల తడిగా, జారేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఇది జారిపడి పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా, మురికి, హానికరమైన బ్యాక్టీరియా పాదాలకు అంటుకుని హాని కలిగి చేయవచ్చు. కాబట్టి మీ ఇంటి వెలుపల ఉన్నప్పుడు ఎల్లప్పుడూ బూట్లు ధరించేలా చూసుకోండి.

క్రమం తప్పకుండా వ్యాయామం..

డయాబెటిక్ ఫుట్ కేర్‌లో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం. రెగ్యులర్ వ్యాయామం పాదాలలో రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్, పుళ్ళు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.

మీ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించండి..

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు పాదాలలో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇది పాదాలలో తిమ్మిరి, జలదరింపు అనుభూతికి దారితీస్తుంది. అందువల్ల, మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా ఏవైనా హెచ్చుతగ్గులున్నా ముందుగానే గుర్తించి, తదనుగుణంగా చికిత్స చేయవచ్చు.