ప్రస్తుతం ఉన్న జీవనశైలి.. బిజీ లైఫ్ లో రెగ్యులర్ షుగర్ చెకప్ కాస్త కష్టమే.. అందుకే షుగర్ ఉన్న వాళ్లు డైట్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. తినేవాటితోనే షుగర్ కంట్రోల్లో ఉంచాలి.దానికోసం చాలామంది నో షుగర్ డైట్' ఫాలో అవుతుంటారు. నో షుగర్ డైట్ అంటే తినేవాటిలో షుగర్ కంటెంట్ లేకపోవడమే. అయితే ఈ డైట్ మీద కొన్ని అపోహలున్నాయి
షుగర్ ఉన్నవాళ్లకు ఒక సమస్య బాగా వేధిస్తుంటుంది. తినే ఆహారంలో తీపిని పూర్తిగా కట్ చేయలేరు. అలాగని షుగర్ ను ఎక్కువగానూ వాడలేరు. అందుకే షుగర్ ఫ్రీ డైట్ అనేది చాలా మందికి ఒక కలగానే ఉండిపోతుంది. షుగర్ శరీరంలోకి ఎక్కువగా చేరడం వల్ల చాలారకాల జబ్బులు, గుండె సమస్యలు, ఒబెసిటికి డయాబెటిస్ కి కారణమవుతుందని అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది ఫుడ్ నుండి షుగర్ ను పూర్తిగా ఎవాయిడ్ చేస్తుంటారు. కాస్త తీపిగా ఉన్న దేనిని తినరు.. అయితే అలా ఉండడం చాలా కష్టమని షుగర్ ఫ్రీ డైట్ పాటించడానికి చాలా మంది పేషెంట్లు ఎంతో అవస్థ పడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి షుగర్ ఫ్రీ డైట్ అంటే తీయగా ఉన్న ప్రతీదాన్ని తినకుండా ఉండడం కాదు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అవేంటంటే.
ఫ్రూట్స్ మానేయాలా
సాధారణం గా ఫ్రూట్స్ అన్నీ తియ్యగా ఉంటాయి. దాంతో వాటితో కూడా షుగర్ పెరిగే ప్రమాదం ఉంది అనుకుంటారు. చాలా మంది. అయితే ఫ్రూట్స్ లో షుగర్ కంటెంట్ ఉంటుందన్న మాట వాస్తవమే. అయినా.. ఆ షుగర్ మనకె లాంటి హాని ఉండవంటున్నారు నిపుణులు వెజిటబుల్స్ పూర్తిగా తినడం వల్ల శరీరంలో ఫైబర్, విటమిన్ ల స్థాయి పెరుగుతుంది. కాబట్టి నోషుగర్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చు.
►ALSO READ | Vastu Tips: ఇంటికి రెండు వైపులా మెట్లు ఉంటే నష్టం జరుగుతుందా.. ఆఫీస్ రూం ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి
ఫ్యాట్ ఫుడ్ ను తగ్గించాలా ..!
షుగర్ ఉన్నవాళ్లు షుగర్ తో పాటు ఫాట్ కంటెంట్ ను కూడా పూర్తిగా తగ్గించడం వల్ల శరీరాన్ని మరింత కష్టపెట్టిన వాళ్లవుతారు. షుగర్ తగ్గించడం వల్ల శరీరం కోల్పోయే శక్తిని హెల్దీ ఫ్కాట్స్ ద్వారా పొందొచ్చని నిపుణులు చెప్తున్నాడు. ఉదాహరణకు నో షుగర్ డైట్ లో భాగంగా షుగర్ ఫ్రీ యోగన్ల ను ఎంచుకుంటే యోగన్లలో ఫ్యాట్ తగ్గించాల్సిన పని లేదు. అలాగే టీ కాఫీల్లో షుగర్ పూర్తిగా తగ్గించాలను కుంటే దాని కోసం వెన్న తీసిన పాలు అవసరం లేదు. షుగర్ తగ్గించినప్పుడు ఫ్యాట్ ను కొంత వరకూ తీసుకోవడమే మంచి దనేది నిపుణుల మాట.
తియ్యగా లేకపోతే షుగర్ లేనట్టా
తియ్యగా ఉన్న ప్రతీ దాంట్లో షుగర్. ఉండొచ్చేమో గానీ.. తియ్యగా లేని ప్రతీ దాంట్లో. షుగర్ ఉండదని మాత్రం చెప్పలేం.ఉదాహరణకు పిజ్జా, బర్గర్, వీట్ జైన్, క్యారెట్ -సాస్ లాంటి చాలారకాల ప్రాసెస్ట్ ఫుడ్స్ లో హై షుగర్ కంటెంట్ ఉంటుంది. కానీ అవేమీ అంత తియ్యగా ఉండవు. అంటే తియ్యగా ఉంటేనే షుగర్ అన్నది ఒక అపోహ. షుగర్ కంటెంట్ చాలా రకాల ఫుడ్స్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెస్ట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ లో మరీ ఎక్కువ. అందుకే నో షుగర్ డైట్ పాటించేవాళ్లు అలాంటి ప్రాసెస్ట్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
డార్క్ చాక్లెట్ లో షుగర్ ఉండదా?
డార్క్ చాక్లెట్ లో షుగర్ ఉండదనుకుంటారు చాలామంది. ఇది కొంత వరకు కరెక్ట్. డార్క్ చాక్లెట్ లో మామూలు పాలతో చేసిన చాక్లెట్ కంటే తక్కువ షుగర్ ఉంటుంది. సుమారు70 శాతం కోకో గింజలతో తయారు చేసిన చాక్లెట్ ను డార్క్ చాక్లెట్ అంటారు. కోకో గింజలు మామూలుగానే చేదుగా ఉంటాయి. వాటిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువ. కాబట్టి నో షుగర్ డైట్ లో డార్క్ చాక్లెట్ ను యాడ్ చేయెచ్చు.
ఆల్కహాల్ మానేస్తే..
షుగర్ కంటెంట్ ను కట్ చేయాలంటే ఆల్కహాల్ మానేయాల్సిందేనా అనేది డవుట్ . అంతే అది ఎంత రెగ్యులర్ డ్రింక్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక గ్లాస్ రెడ్ వైన్లో 9.9 గ్రాముల షుగర్ ఉంటుంది. షుగర్ కంటెంట్ తక్కువగానే ఉన్నా తరచుగా తాగితే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలాగే షుగర్ ను పెంచక పోయినా.. ఆల్కహాల్ అనేది మెటబాలిజంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ షుగర్ ఉన్నవాళ్లు ఆల్కహాలకు దూరంగా ఉండడమే మంచిది.
షుగర్ కట్ చేయడం తేలికా?
షుగర్ ఉన్న వాళ్లు పాటించే డైట్ అంత సులువు కాదు. కంట్రోల్ లో ఉండడం చాలా కష్టం అనుకుంటారు ఎక్కువ మంది. అయితే నిపుణుల ప్రకారం నో షుగర్ డ్రైట్ అందరూ అనుకునేంత కష్టం ఏమీ కాదు... కాస్త ప్లాన్ చేసుకుంటే ఈజీనే. తీపి లేని రుచులు కొంతకాలానికి ఈజీగా అలవాటైపోతాయి.. చాలామంది అచ్చంగా డైట్ తోనే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇవి కూడా..
- డయాబెటిస్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని భోజనానికి ముందు 110 ఎంజీ భోజనం తర్వాత 160 ఎంజీ దగ్గర ఉంచడం ముఖ్యం.
- మెడికల్ స్టోర్స్ అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవాళ్లు మందులు దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులు ఇన్సులిన్ ను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి.
- డయాబెటిక్స్ రోజులో కొంత టైం ఎక్సర్ సైజు కేటాయించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామం తప్పనిసరి.
- కార్బోహైడ్రేట్స్, సాల్ట్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి వాటికి బదులు కూరగాయలు, ఫ్రూట్స్ తినొచ్చు.
- అలాగే డయాబెటిస్ పేషెంట్లు స్ట్రెస్ , డిప్రెషన్ దూరంగా ఉండాలి.. ఈ టైంలో స్ట్రెస్ కు లోనైతే రక్తపోటులో మార్పులొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి

