మీకు డయాబెటిక్​ ఉందా.. పంచదారకు బదులు ఇవి వాడండి.

 మీకు డయాబెటిక్​ ఉందా.. పంచదారకు బదులు ఇవి వాడండి.

డయాబెటిక్​(షుగర్​)అనేది ప్రమాదకరమైన వ్యాధి. మధుమేహం ఉన్నవారు రోజువారిగా తినే ఆహారం, తాగే పానీయాలపైపరిమితులతో జీవించవలసి ఉంటుంది. జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిపెరగడం మధుమేహ వ్యాధికి ముఖ్య కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఉన్నా  వ్యక్తి శరీరంలో ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. 

మధుమేహం  స్లో డెత్

గతంలో ఈ వ్యాధి 40-45 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ, ప్రస్తుతం యువత కూడా దీని బారిన పడుతున్నారు.  ప్రస్తుతం చాలా మంది  ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. దీనితో పాటు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే...శరీరంలో షుగర్ లెవెల్స్​ పెరిగిపోతాయి. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి.  అంతే కాకుండా తీపి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్యులు  సలహా ఇస్తారు. తీపి పదార్థాలు డయాబెటిక్ రోగులకు విషం లాంటివి, ఇవి హాని కలిగిస్తుంది.అందుకే మధుమేహాన్ని స్లో డెత్ అంటారు.

చక్కెరకు బదులు ఇవి వాడండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటున కూడా చక్కెరను ఉపయోగించకూడదు. ఇది షుగర్ లెవల్స్​ను పెంచుతుంది. చక్కెర కాకుండా  బెల్లం, తేనె వాడవచ్చు. ఈ రెండూ ఆహారానికి తీపిని తెస్తాయి. ఇది శరీరానికి హాని కలిగించదు. చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం లేదు.

బెల్లం , తేనె వాడితే మంచిది

సాధారణ వ్యక్తులు కూడా చక్కెర కంటే బెల్లం లేదా తేనె తీసుకోవడం మంచిది. డయాబెటిక్ రోగులు చక్కెరను అసలు తీసుకోకూడదు. కానీ బెల్లం మరియు తేనె గురించి మాట్లాడుకుంటే  డయాబెటిక్ రోగులు బెల్లం తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. కానీ సాధారణంగా, అటువంటి వ్యక్తులు బెల్లం వినియోగానికి దూరంగా ఉండడటమే మంచిది. చక్కెర,  బెల్లం తయారీకి చెరకును ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

బెల్లం, తేనె ఉపయోగాలు

యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తేనెలో ఉన్నాయి. తేనెను ఉపయోగించడం ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.  ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బెల్లం గురించి చెప్పాలంటే..పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం,ఇంకా B1, B6, C విటమిన్లు  పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మంచిది. బెల్లం బదులుగా తేనె తీసుకోవడం మధుమేహ రోగికి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సహజంగా తయారవుతుంది. అంతేకాకుండా సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది.