ప్రాణం కాపాడిన ‘డయల్ 100’

ప్రాణం కాపాడిన ‘డయల్ 100’

నల్లగొండ అర్బన్, వెలుగు : డయల్​ 100 ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. నల్లగొండలోని పాలిటెక్నిక్​ కళాశాల సమీపంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అతడి గురించి డయల్ 100 కు సమాచారం రాగా సెల్ ఫోన్ సిగ్నల్స్​ ఆధారంగా నల్గొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి వెంటనే పెట్రో కార్ సిబ్బందిని సిగ్నల్స్​ ఆధారంగా  ఘటనా స్థలానికి పంపించాడు. రైలు పట్టాలపై చనిపోయేందుకు పడుకుని ఉన్న ఆ వ్యక్తిని కాపాడి కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.