డైమండ్స్ రేట్లు తగ్గుతున్నాయ్‌!‌‌

డైమండ్స్ రేట్లు తగ్గుతున్నాయ్‌!‌‌
  • డైమండ్ల రేట్లు తగ్గుతున్నాయ్‌!
  • డైమండ్ జ్యువెలరీ కొనుగోలుకు ఇదే మంచిటైమ్‌‌
  • మే నాటికి మళ్లీ రేట్లు పెరుగుతాయ్‌‌: ఎనలిస్టులు

కోల్‌‌కతా: డైమండ్స్ కొనాలనుకునేవారికి ఇదే మంచి టైమ్‌‌. గ్లోబల్‌‌గా డిమాండ్ పడిపోవడంతో పాటు, రఫ్‌‌ డైమండ్ల నిల్వలు ఎక్కువగా ఉండడంతో  పాలిస్‌‌ డైమండ్ల ధరలు తగ్గుతున్నాయి. పెద్ద డైమండ్లతో పోలిస్తే చిన్న డైమండ్ల ధరలు పడుతున్నాయి. చిన్న డైమండ్లను ఎక్కువగా మిడిల్‌‌ క్లాస్‌‌ కుటుంబాలు కొంటుంటాయి. రేట్లు తగ్గడం తాత్కాలికమని,  ఈ ఏడాది మే నాటికి డైమండ్ల రేట్లు తిరిగి పుంజుకుంటాయని జ్యువెలరీ ఎక్స్‌‌పోర్ట్‌‌ ప్రమోషన్‌‌ కౌన్షిల్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ విపుల్‌‌ షా అన్నారు. డైమండ్ జ్యువెలరీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇదే మంచి టైమ్‌‌ అని పేర్కొన్నారు. గోల్డ్‌‌ ధరలు కూడా పడుతుండడంతో తక్కువ ధరలోనే జ్యువెలరీని కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు ఉంటుందని అభిఫ్రాయపడ్డారు. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 44,228 వద్ద ట్రేడవుతోంది.  గ్లోబల్‌‌గా డైమండ్‌‌ సేల్స్‌‌ ఊపందుకున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ–కామర్స్‌‌ చానెల్స్​లో వీటి అమ్మకాలు పుంజుకుంటున్నాయని,  జనవరిలో జరిగిన చైనీస్ న్యూ ఇయర్‌‌‌‌ టైమ్‌‌లో ఆ దేశంలో  డైమండ్ అమ్మకాలు 15 శాతం పెరిగాయని తెలిపాయి. వాలెంటైన్స్‌‌ డే టైమ్‌‌లో యూఎస్‌‌లో కూడా సేల్స్ పుంజుకున్నాయని  పేర్కొన్నాయి. గ్లోబల్‌‌ మార్కెట్లలో డైమండ్స్‌‌ సేల్స్ పెరుగుతుండడంతో వీటి ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనావేస్తున్నాయి.

రఫ్‌‌ డైమండ్ల ధరలు పెరుగుతున్నాయి..
డైమండ్స్‌‌ను పాలిష్ చేసి అమ్మడం కోసం సప్లయర్లు కిందటేడాది తమ రఫ్‌‌ డైమండ్ నిల్వలను పెంచుకున్నాయి. కానీ కరోనా లాక్‌‌డౌన్‌‌తో పాలిష్ డైమండ్ల సప్లయ్‌‌ ఆగిపోయింది. ప్రస్తుతం వీటి సప్లయ్‌‌ ఒక్కసారిగా పెరగడంతో కూడా పాలిష్ డైమండ్ల ధరలు తగ్గుతున్నాయి. డైమండ్‌‌ సప్లయ్‌‌, డిమాండ్ బాగుందని షా అన్నారు.  డైమండ్ మైనింగ్ కంపెనీలయిన డీ బీర్స్‌‌, ఆల్‌‌రోసాలు రఫ్‌‌ డైమండ్ ధరలను ఫిబ్రవరిలో  3–5 శాతం వరకు పెంచాయని రాపపోర్ట్‌‌ రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఈ డైమండ్ల వాల్యుయేషన్‌‌ కరోనా ముందు స్థాయిలకు చేరుకుందని తెలిపింది.  రేట్లు పెరుగుతుండడంతో పాలిష్​డ్​ డైమండ్ సప్లయర్లు తమ మార్జిన్లను కాపాడుకోవాలని చూస్తున్నారు. పెరుగుతున్న రేట్లను  కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో డైమండ్స్‌‌కు  మంచి డిమాండ్ ఏర్పడిందని డీ బీర్స్‌‌ ఇండియా ఎండీ సచిన్‌‌ జైన్ అన్నారు. ఎకానమీ రీఓపెన్ అవ్వడంతో డిమాండ్‌‌లో రికవరీ కనిపిస్తోందని చెప్పారు. మిలీనియల్స్‌‌ (40 ఏళ్లకు పైనున్న వారు) కీలకమైన  కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. ఒక పీస్‌‌ డైమండ్ ఉన్న జ్యువెలర్స్‌‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని జైన్ అన్నారు. ‘దీపావళి, ధంతెరాస్‌‌ వంటి పండగ టైమ్‌‌లో టియర్‌‌‌‌ 2, టియర్‌‌‌‌ 3 సిటీల నుంచి కూడా డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం మెట్రోలలో డిమాండ్ ఉంది. రానున్న ఆరు నెలల్లో డైమండ్స్‌‌ డిమాండ్ మరింత రికవర్ అవుతుందని అంచనావేస్తున్నాం’ అని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్‌‌ కూడా విస్తరించనుండడంతో దేశ ఎకానమీ మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. 

సకూరా డైమండ్‌‌@280 కోట్లు
అత్యంత విలువైన, అరుదైన 15.81 క్యారట్ల సకూరా డైమండ్‌‌ అమ్మకానికి రెడీ అవుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పింక్‌‌ డైమండ్‌‌. అమ్మకానికి రావడం కూడా ఇదే మొదటిసారి. వేలంలో ఇది 38 మిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.280 కోట్లు) పలికే అవకాశం ఉందని అంచనా. హాంకాంగ్‌‌లోని అక్షన్‌‌ హౌస్‌‌ క్రిస్టీ దీనిని ఈ ఏడాది మే 23న వేలానికి పెట్టనుంది. ఇతర డైమండ్స్‌‌తో పోలిస్తే ఇందులో ట్రాన్స్‌‌పరెన్సీ, కలర్స్‌‌ అద్భుతంగా ఉంటాయి. సైజు కూడా భారీ ఉంటుంది. చూడగానే అద్భుతమైన అనుభూతి పొందుతారని క్రిస్టీ సంస్థ చెబుతోంది.