ఢిల్లీలో నిన్న 49 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇవాళ చల్లని వాతావరణం 

ఢిల్లీలో నిన్న 49 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇవాళ చల్లని వాతావరణం 

ఢిల్లీలో డిఫరెంట్ వెదర్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న గరిష్ఠంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..ఇవాళ వాతావరణం చల్లగా మారింది. నాలుగు రోజులుగా ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వేడి, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 45 డిగ్రీలు దాటాయి. ముంగేశ్ పూర్ ప్రాంతంలో అత్యధికంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నజఫ్ గఢ్ అబ్డర్వేటరీ ఏరియాలో 49.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గుర్ గ్రామ్ లో 56 ఏళ్ల తర్వాత అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గుర్ గ్రామ్ లో 48.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. ఢిల్లీలోని 8 ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మరికొన్ని గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, బెంగాల్ తీర ప్రాంతాలను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ఠంగా 41 డిగ్రీలు, కనిష్ఠంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఈనెల 18 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 

మరిన్ని వార్తల కోసం..

98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..