డీసీసీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి కుటుంబానికి.. మంత్రి ఉత్తమ్ పరామర్శ

డీసీసీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి కుటుంబానికి.. మంత్రి ఉత్తమ్ పరామర్శ

హుజూర్ నగర్,వెలుగు: డీసీసీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన కుటుంబాన్ని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. గెల్లి రవి తల్లిదండ్రులైన హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు, అరుణ దంపతులు ఇటీవల మృతిచెందారు. దీంతో మంత్రి ఉత్తమ్ ఆదివారం ఇంటికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 అనంతరం గెల్లి అప్పారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యాపార, సేవా రంగాల్లో  గెల్లి అప్పారావు కుటుంబం చేసిన సేవలను మంత్రి కొనియాడారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.