
పాట్నా: బిహార్సీఎం నితీశ్కుమార్నిజాయతీపరుడే కావొచ్చు కానీ ఆయన కేబినెట్లోని మంత్రులు దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నారని జన్‌సురాజ్‌పార్టీ చీఫ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ప్రశాంత్కిశోర్వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న బిహార్అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ప్రశాంత్‌కిశోర్.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది. సీఎం నితీశ్ నిజాయితీపరుడే కావొచ్చు.. కానీ, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు మాత్రం పేదలను నిలువునా దోచుకుంటున్నారు.
ఈ విషయాన్ని పేదల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లే చెప్తున్నారు” అని అన్నారు. తాను మూడేండ్ల నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్నానని.. ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నానని ప్రశాంత్ కిశోర్పేర్కొన్నారు. ‘‘బిహార్‌లోని వాస్తవ పరిస్థితిని అందరి ముందుంచుతున్న. కొందరు అధికారులు, మంత్రులు కలిసి ప్రజలను లూటీ చేస్తున్నరు. వేల కోట్లు దోచేస్తున్నరు. ఇలాంటి అవినీతిని ఇంతకుముందెన్నడూ చూడలేదని జనమే చెప్తున్నరు” అని ఆయన తెలిపారు.