గ్రూప్–2లో మూడోసారి సర్కారు కొలువుకు ఎంపిక

 గ్రూప్–2లో మూడోసారి సర్కారు కొలువుకు ఎంపిక

దంతాలపల్లి, వెలుగు: గ్రూపు-2 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మండల పరిధిలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన దిగోజు బద్రమ్మ సోమయ్య దంపతుల కొడుకు దిగోజు షరీశ్​ గ్రూప్​–2లో ఉద్యోగం సాధించాడు.

 షరీశ్​ఇప్పటికే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించగా, తర్వాత గ్రూప్–4 లో జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ కాగా, ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్​స్పెక్టర్​గా సెలెక్ట్ అయ్యాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన షరీశ్​ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.