Digvesh Rathi: నన్నెవడ్రా ఆపేది.. ఈసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ అదిరిపోవాల్సిందే

Digvesh Rathi: నన్నెవడ్రా ఆపేది.. ఈసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ అదిరిపోవాల్సిందే

Digvesh Rathi: ఐపీఎల్ 2026 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ కి ముందు గత ఏడాది నోట్ బుక్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా?.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసినప్పుడల్లా ఏదో సిగ్నేచర్ చేస్తున్నట్లు వేడుకలు చేశాడు. దీనిపై గతేడాది ఐపీఎల్లోనూ అభిషేక్ శర్మతో కాస్త గొడవ కూడా జరిగింది. పలుమార్లు జరిమానాను ఎదుర్కొన్నప్పటికీ అతడు.. ఒక మ్యాచ్ సస్పెన్షన్ కి గురైయ్యాడు. 

అనంతరం దేశవాళీలోనూ అదే ప్రవర్తనతో వ్యవహరించిన అతడు  తీవ్రవివాదాస్పదంగా మారాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్లో ఆడుతుండటంతో తన పంథాను మార్చుకొనేది లేదని దిగ్వేశ్ రాఠీ తేల్చి చెప్పాడు. నేను ఇక్కడ ఏ ప్లేయర్ ని అవమానించట్లేదు.. నా ఉద్దేశం అది కాదు.. ఎవరూ కూడా నా సెలబ్రేషన్స్ ని ఆపలేరు.. ఏ బ్యాటర్ కూడా సెంచరీ చేసిన తర్వాత సంబరాలు చేసుకున్నప్పుడు.. నేను కూడా వేడుకలు చేసుకుంటే తప్పా అని క్వశ్చన్ చేశాడు. రిషబ్ పంత్ భాయ్, లక్నో మేనేజ్మెంట్ మాత్రం ఒక సూచన ఇచ్చారు. నేను స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నా.. నిషేధం మాత్రం పడకుండా చూసుకోమన్నారు.  

ALSO READ :  చెన్నై సూపర్ కింగ్స్ని టీజ్ చేసిన జడేజా..

కాగా ఒకే ఏడాది మూడు సార్లు ఓవర్ యాక్షన్ చేసినందుకు దిగ్వేశ్ రాఠీకి భారీ ఫైన్ విధించారు. మొదట 25 శాతం, రెండోసారి 50 శాతం చొప్పున జరిమాని పడింది. మూడోసారి ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. తన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ని కూడా సంపాదించుకున్నాడు. నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే.. సస్పెన్షన్ పాయింట్ కి సమానం. ఆ మార్క్ కు చేరుకుంటే మాత్రం మ్యాచ్ నిషేధం పడుతుంది. 36 నెలల వ్యవధిలో 8 డీమెరిట్ పాయింట్లు వస్తే రెండు మ్యాచులలో ఆడకుండా నిషేధం, 11 పాయింట్లు వస్తే 3 మ్యాచుల్లో బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది.