మేం పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ ఆర్టికల్ 370

మేం పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ ఆర్టికల్ 370

న్యూఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్  పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే కాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని మళ్లీ అమలు చేసే అంశంపై పరిశీలిస్తామని  ఆ పార్టీసీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోషల్ మీడియా యాప్‌‌‌‌ క్లబ్‌‌‌‌ హౌస్‌‌‌‌లో జరిగిన ఓ మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌‌‌‌కు చెందిన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ కామెంట్ చేశారు. ‘జమ్ము కశ్మీర్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర హోదా తొలగించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం చాలా బాధాకరం. మోడీ ప్రభుత్వం దిగిపోయి, మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని అమలులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’ అని దిగ్విజయ్ అన్నారు.

ఇది పాక్‌‌‌‌కు రాహుల్ మెసేజ్

దిగ్విజయ్ కామెంట్స్‌‌‌‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన క్లబ్‌‌‌‌హౌస్‌‌‌‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌‌‌‌ను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేశారు. పాక్‌‌‌‌ ఏం కోరుకుంటున్నదో అదే దిగ్విజయ్ మాట్లాడారని ఆయన అన్నారు. పాకిస్థాన్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తన ప్రేమను మరోసారి వ్యక్తం చేసిందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌‌‌‌ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరును ఐఎన్‌‌‌‌సీ అని కాకుండా ఏఎన్‌‌‌‌సీ (యాంటీ నేషనల్ క్లబ్‌‌‌‌హౌస్) అని మార్చుకోవాలని సంబిత్ పాత్రా మండిపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ స్టాండ్‌‌‌‌ ఏంటో క్లియర్‌‌‌‌‌‌‌‌గా చెప్పాలని డిమాండ్ చేశారు.  అయితే ఇష్యూ కాంట్రవర్షియల్ కావడంతో దిగ్విజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఆర్టికల్ 370 పెడతామని చెప్పలేదని,ఆలోచిస్తామనేదానికి, పెడతామనేదానికి తేడా తెలియకపోతే ఎలా అంటూ దిగ్విజయ్​ సింగ్​ ట్వీట్‌‌‌‌ చేశారు.