
కాంగ్రెస్ లో అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నా.. ఇప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరెవరనేది తేలడం లేదు. కాగా, రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తానని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ కార్యాలయానికి వచ్చి.. నామినేషన్ పత్రాలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్లు దిగ్విజయ్ సన్నిహితులు తెలిపారు. రేపు దిగ్విజయ్ నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
సోనియా అడిగినట్లయితే.. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేస్తారని తెలిపాయి ఆ పార్టీ వర్గాలు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటిస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీపై ఆసక్తి లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమమల్ నాథ్ తెలిపారు.