Dil Raju: నా పెళ్లి, భార్య విషయంలో కూడా ట్రోల్ అయ్యాను.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Dil Raju: నా పెళ్లి, భార్య విషయంలో కూడా ట్రోల్ అయ్యాను.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు(Dil Raju) ఒకరు. ఆయన కాంపౌండ్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే.. అందులో ఖచ్చితంగా విషయం ఉంటుందని ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు దిల్ రాజు. ఆయన సంస్థ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత్త్ దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు... కొన్నేళ్ల ముందుకు వరకు కూడా నాకు ఈ మీమ్స్‌, ట్రోల్స్ గురించి అవగాహనలేదు. నేను రెండోపెళ్లి చేసుకున్న తర్వాత ఒక పెద్ద చానల్‌ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో నా భార్యను ఎలా కలిశాను, మా ఇద్దరి జర్నీ, పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పాను. ఆ వీడియో మీద చాలా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ వీడియోలు నా భార్య నాకు చూపించింది. ఆ సమయంలోనే నాకు ఈ ట్రోలింగ్ గురించి తెలిసింది.

అయినా.. ట్రోలింగ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. రెండు తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోట్ల మంది ఉన్నారు. వారిలో కొంతమంది నాపై నెగటివ్ కామెంట్స్‌ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకుంటూ పోతే.. నన్ను అభిమానించే వాళ్లకు దూరమవుతాను.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.