దిల్ రాజు ఇంటికి 'వారసుడు' వచ్చాడు

దిల్ రాజు ఇంటికి 'వారసుడు' వచ్చాడు

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు.. మరోసారి తండ్రి అయ్యారు. మొదటి భార్య మరణం అనంతరం అతని కూతురు హన్షతి, కుటుంబ సభ్యుల కోరిక మేరకు... 2020లో తేజస్వినిని రెండో వివాహం చేసుకోగా... తాజాగా ఈ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వారిద్దరికీ  పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే బండ్ల గణేష్ కూడా దిల్ రాజు అన్నా.. కంగ్రాజ్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న దిల్ రాజు... శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా చిత్రంతో పాటు, వంశీ పైడిపల్లి, విజయ్ కాంబో లో మరో క్రేజీ మూవీని కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు సమాచారం.