స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెకండ్ మ్యారేజ్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెకండ్ మ్యారేజ్

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆదివారం నిజామాబాద్ లోని నార్సింగిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 11 గంటలకు ఈ వేడుక జరిగింది.

లాక్ డౌన్ కారణంగా కొందరు కుటుంబ సన్నిహితులు, స్నేహితుల మధ్య పెళ్లి జరిగింది. రాజు కుమార్తె హన్షిత రెడ్డి వివాహ వేడుకకు సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారని సమాచారం.

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 మార్చి 12న హార్ట్ ఎటాక్ తో చనిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా రాజు రెండో వివాహంపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.