నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడి అయిన దిల్‌‌‌‌‌‌‌‌రుబా

 నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడి అయిన  దిల్‌‌‌‌‌‌‌‌రుబా

ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కానీ తాప్సీ చేస్తోంది. ఇప్పుడంటే లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ వల్ల బ్రేక్ వచ్చిందేమో కానీ.. మొన్నమొన్నటి వరకు వరుస షూటింగులతో రెస్ట్ లేకుండా గడిపింది. ప్రస్తుతం మూడు నాలుగు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని రిలీజ్‌‌‌‌‌‌‌‌కి కూడా రెడీ అయ్యాయి. వాటిలో ‘హసీన్ దిల్‌‌‌‌‌‌‌‌రుబా’ ఒకటి. వినీల్ మాథ్యూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తాప్సీకి జోడీగా విక్రాంత్ మాసే నటించాడు. అవును, ఫిదా చిత్రాల్లో నటించిన హర్షవర్థన్ రాణే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హన్సిక కూడా ఓ స్పెషల్ రోల్ చేసినట్లు సమాచారం. షూటింగ్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యేసరికి కాస్త లేటయ్యింది. అంతలో కరోనా పెరిగి థియేటర్లు మూతబడ్డాయి. రిలీజులు ఆగిపోయాయి. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియట్లేదు కనుక ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు దర్శక నిర్మాతలు. జూలై 2న నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేయనున్నట్లు నిన్న ప్రకటించారు. తాప్సీ చేసే అన్ని సినిమాల్లాగే ఇది కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కింది. లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీ మిక్స్ చేసిన ఈ మర్డర్ మిస్టరీలో తాప్సీ పాత్ర చాలా సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని టీమ్ చెప్పడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత జనగణమన, రష్మీ రాకెట్, లూప్ లపేటా, దొబారా, శభాష్ మిథూ చిత్రాలతో పాటు.. ఇంకా పేరు నిర్ణయించని ఓ తమిళ సినిమా కూడా తాప్సీ నుంచి రానుంది.