Dimple Hayathi: డింపుల్ డీగ్లామర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా.. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి పెంచిన భోగి టీమ్

Dimple Hayathi: డింపుల్ డీగ్లామర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా.. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి పెంచిన భోగి టీమ్

గ్లామర్ రోల్స్‌‌‌‌తో  ఆకట్టుకునే  డింపుల్ హయతి.. ఇప్పుడొక డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో  కనిపించబోతోంది. శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న ‘భోగి’ చిత్రంలో డింపుల్ కీలక పాత్ర  పోషిస్తోంది.

సోమవారం ఆమె ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్   చేస్తూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. ఇందులో ఆమె మందారం పాత్రలో కనిపించనున్నట్టు తెలియజేశారు.  ఎర్రచీర,  చేతిలో తాటాకు  విసనకర్ర, కాళ్లకు పారాణి, పక్కన టేబుల్ మీద తాంబూలం పెట్టె ఉన్న ఈ స్టిల్‌‌‌‌తో తన పాత్ర ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు. చుట్టూ ఉన్న ప్రపంచం, సమాజం తీరును లెక్క చేయని వేశ్య పాత్రను ఆమె  పోషిస్తున్నట్టు  ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ ద్వారా అర్ధమవుతోంది.

పీరియాడికల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డింపుల్  పాత్ర కీలకంగా ఉండనుందని  తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, ఇప్పటికే తన ఫస్ట్ లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

1960ల నేపథ్యంలో తెలంగాణ-–మహారాష్ట్ర సరిహద్దుల్లో  సాగే ఈ కథ యాక్షన్, ఎమోషన్‌‌‌‌తో నిండిన పీరియాడికల్   డ్రామాగా రూపొందుతోంది.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా సినిమా విడుదల  కానుంది.