
టీంఇండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌లో 11 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డు నెలకొల్పాడు. , 2004లో సౌరవ్ గంగూలీ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు దినేష్ కార్తీక్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ల కెప్టెన్సీల్లో కార్తీక్ ఆడాడు. పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కెప్టెన్సీలో ఐసీసీ ఎలెవెన్ జట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్ ను కలుపుకుంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం 37వ ఏళ్ల వయసున్న కార్తీక్.. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్ల సంఖ్యను 12కు పెంచుకోబోతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో అతను ఆడబోతున్నాడు. కాగా 2019 ప్రపంచకప్ తర్వాత దినేష్ కార్తీక్ కి టీంఇండియా జట్టులో చోటు దక్కలేదు. కానీ ఐపీఎల్ 2022లో సత్తా చాటడం ద్వారా మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.