రేపు మరోసారి కాంగ్రెస్ సీనియర్ల భేటీ

 రేపు మరోసారి కాంగ్రెస్ సీనియర్ల భేటీ
  • రేవంత్ -సీనియర్ల మధ్య గ్యాప్ తొలగించడానికి డిన్నర్ ప్లాన్
  • పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేతల మధ్య డిస్కషన్
  • డిన్నర్ ఏర్పాటు చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో డిన్నర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. రేపు మరోసారి కాంగ్రెస్ సీనియర్లు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి - కొందరు సీనియర్ల మధ్య ఏర్పడిన గ్యాప్ ను తొలగించడానికి డిన్నర్ డిస్కషన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయడానికి.. కొత్త వారి చేరికలపై చర్చించడానికి ఈ డిన్నర్ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. 
 పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు శ్రీనివాసన్, పీసీసీ కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. నెల రోజులకు పైగా రాష్ట్రంలో జరుగుతోన్న రైతు రచ్చబండ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు డీసీసీ అధ్యక్షులు. రచ్చబండ కార్యక్రమం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు రేవంత్, మాణిక్కం ఠాగూర్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఆధారంగా డీసీసీ అధ్యక్షులను రేవంత్, ఠాగూర్ వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉండటంతో దానిపై కూడా మీటింగ్ లో చర్చిస్తున్నారు. పార్టీలో చేరికలపై కూడా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
రేపు జూబ్లిహిల్స్ క్లబ్లో డిన్నర్

మరోవైపు కాంగ్రెస్ నేతలకు రేపు జూబ్లీహిల్స్ క్లబ్లో డిన్నర్ ఏర్పాటు చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ కార్యవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు నేతలు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. అయితే పార్టీలో చేరికల సందర్భంగా సీనియర్లు, రేవంత్  వర్గానికి మధ్య ఏర్పడిన విభేదాలను పోగొట్టడానికే డిన్నర్ ప్లాన్ చేసినట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. సీనియర్లు, రేవంత్ వర్గానికి మధ్యవర్తిత్వం కోసమే మహేష్ కుమార్ గౌడ్ డిన్నర్ అంటున్నారు నేతలు.