ఎంత పెద్దగుందో డైనోసార్​ ఎముక

ఎంత పెద్దగుందో డైనోసార్​ ఎముక

ఇది డైనోసార్​ తొడ ఎముక (ఫీమర్​). ఫ్రాన్స్​లో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతుండగా ఈ ఎముక బయటపడింది. రెండు మీటర్ల పొడవున్న ఈ ఫీమర్​ను యాంజియాక్​ చారెంటీ సైట్​ వద్ద వెలికి తీశారు. సారోపోడ్​ జాతికి చెందిన డైనోసార్​ ఎముకగా భావిస్తున్నారు. పూర్తి శాకాహారట ఇది. అంటే మాంసం ముట్టదట. కేవలం చెట్లు, చేమలు, ఆకులు, అలములు తిని బతికేదని అనుకుంటున్నారు. 14 కోట్ల ఏళ్ల వయసుంటుందని అంచనా వేస్తున్నారు.  ఆ డైనోసార్​ బరువు 40 నుంచి 50 టన్నులు వరకు ఉంటుందని చెబుతున్నారు. చెక్కుచెదరకుండా ఎముక ఎముకలాగే ఉండడం చూసి సైంటిస్టులు ఔరా అంటున్నారు. ఇది నిజంగానే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనంటున్నారు. ఈ సైట్​ వద్దే 2010 నుంచి దాదాపు 40 జాతులకు చెందిన 7,500 దాకా శిలాజాలను గుర్తించినట్టు చెబుతున్నారు.