డైనోసార్ రాబోతుంది.. సలార్ టీం అప్డేట్

డైనోసార్ రాబోతుంది.. సలార్ టీం అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar).  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.  లేటెస్ట్ గా సలార్ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  

మీరు సింహం, చిరుత, పులిని చూశారు. ఇప్పుడు డైనోసార్ ను చూసే టైం వచ్చింది. త్వరలో రాబోతుంది..అంటూ సలార్ టీం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది...దీంతో ప్రభాస్ ఫ్యాన్స్.. డైనోసార్ ను చూసేందుకు రెడీ అంటూ కామెంట్స్ తెలుపుతున్నారు. 

ఇక లేటెస్ట్ గా రిలీజైన సలార్ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పేరు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న 2023 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సలార్ సినిమా దాదాపు 5000 థియేటర్స్ లో రిలీజ్ కానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఈవార్త గనక నిజమైతే.. సలార్ మొదటిరోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. 

దీంతో ఇండియాన్ బాక్సాఫీస్ షేక్ అవడం కుడా ఖాయం. ఈ న్యూస్ తెల్సుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.