రియల్ రేసర్స్‌‌‌‌తో బైకర్ షూట్ చేశాం.. చాలా యాక్సిడెంట్లు అయినయ్: దర్శకుడు అభిలాష్ రెడ్డి

రియల్ రేసర్స్‌‌‌‌తో బైకర్ షూట్ చేశాం.. చాలా యాక్సిడెంట్లు అయినయ్: దర్శకుడు అభిలాష్ రెడ్డి

‘‘బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఇందులో రేసింగ్‌‌‌‌తో పాటు  మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్ అండ్ -సన్ మధ్య ఉండే ఎమోషన్ ప్రతి ఒక్కరికీ  కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రెండు టైమ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో జరుగుతుంది. 90స్‌‌‌‌లో టూ  స్ట్రోక్  బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇక రేసింగ్ సీన్స్ ఇండోనేషియాలో షూట్ చేశాం. ఆ బైక్స్ అన్నీ మళ్లీ ఇండియాకు తీసుకురావడం కూడా చాలా పెద్ద ప్రాసెస్.

 అలాగే  న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి రియల్ రేసర్స్‌‌‌‌ని రప్పించి వారితో షూట్ చేశాం. ఈ క్రమంలో చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. కేవలం యాక్షన్‌‌‌‌కే 60 రోజులకుపైగా టైమ్ పట్టింది. డాల్బీ విజన్‌‌‌‌లో షూట్ చేయడంతో ఆడియెన్స్‌‌‌‌కు  విజువల్‌‌‌‌తోపాటు మంచి సౌండ్  ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది. శర్వానంద్  ఈ సినిమా కోసం  దాదాపు 23 కేజీలు తగ్గారు.  

దాదాపు 6 నెలలు బ్రేక్ తీసుకుని ఫిజికల్‌‌‌‌గా, మెంటల్‌‌‌‌గా ప్రిపేర్ అయ్యారు.  ఆయన ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్‌‌‌‌గా ఉంటుంది. రాజశేఖర్ గారు కోచ్, ఫాదర్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపిస్తారు.  ఆయన ఈ క్యారెక్టర్ చేయడంతో ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. యూవీ క్రియేషన్స్‌‌‌‌లో వచ్చే సినిమాలన్నీ టెక్నికల్‌‌‌‌గా మంచి అవుట్‌‌‌‌పుట్‌‌‌‌తో బయటకు వస్తాయి. ఈ సినిమా విషయంలోనూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు’’.

‘లూజర్’ వెబ్ సిరీస్ , ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీతో దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి.. శర్వానంద్‌‌‌‌తో ‘బైకర్’ చిత్రాన్ని రూపొం దించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిలాష్ రెడ్డి  చెప్పిన విశేషాలు.