గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం పాట

గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం పాట

ఆర్ఎక్స్ 100(RX100) ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaram). హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్(Payal rajputh) ప్రధాన పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేశాయి.

ఇక తాజాగా మంగళవారం నుండి ఫస్ట్ సింగల్ ను ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. గణ గణ మోగాలిరా అంటూ సాగే ఈ అమ్మవారి జాతర సాంగ్ పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఈ ఫుల్ సాంగ్ ను ఆగస్టు 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార, విరూపాక్ష సినిమాలకు అద్భుతమైన పాటలతో.. అదిరిపోయే రీ రికార్డింగ్ అందించిన అజనీష్ లోక్ నాధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. మరోసారి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను ఆడియన్స్ కు రుచిచూపించడానికి సిద్దమయ్యాడు అంజనీష్. మరి మహాసముద్రం సినిమాతో బిగెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అజయ్ భూపతి.. మంగళవారం సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి.