అనిల్ రావిపూడి(Anil Ravipudi).. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరు. ఈ దర్శకుడికి ఇప్పటికి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. తన అద్భుతమైన టాలెంట్ తో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అనిల్. ఇటీవలే బాలకృష్ణతో భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఏ మూవీ. దీంతో ఈ దర్శకుడి తరువాతి సినిమా ఎవరితో ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ దర్శకుడికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన ఆయన అభిమానులు అవాక్కవుతున్నారు. మీరేంటి సార్ ఇలా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అనిల్ రావిపూడి రాజకీయ నాయకుడి గెటప్ లో సీరియస్‌గా ప్రసంగిస్తూ కనిపించారు.. నేను బాక్సాఫీస్ విజయాన్ని చూశాను, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం చూడాలని ఎదురుచూస్తున్నాను. నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాను.. త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తాను.. అని అనిల్ ఆ వీడియోలో అన్నారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ వీడియోను షేర్ చేసింది అనిల్ కాదు.. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా. దీంతో ఆ వీడియో ఆహాలో రాబోతున్న ఏదైనా కొత్త షో గురించా అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఆ షోకి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ వీడియో ఏంటి? ఆ షో ఏంటి? అనేదానిపై అధికారిక ప్రకటన రానుంది.
