Allu Arjun, Atlee: డైరెక్టర్కే అంత ఇస్తే.. మరి హీరోకి ఎంత ఇస్తారో రెమ్యునరేషన్!

Allu Arjun, Atlee: డైరెక్టర్కే అంత ఇస్తే.. మరి హీరోకి ఎంత ఇస్తారో రెమ్యునరేషన్!

తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) ఈమధ్య జవాన్(Jawan) సినిమా చేసి తన  బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాలీవడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో దర్శకుడు అట్లీకి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలో తన తరువాతి సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

జవాన్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా వచ్చి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా తన తరువాతి సినిమాను అధికారికంగా ప్రకటించలేదు అట్లీ. కానీ, ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు అట్లీ తన తరువాతి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడట. అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెరకెక్కించనుందని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు కు సంబంధించి చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 

అయితే ఈ సినిమా కోసం రెన్యునరేషన్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట అట్లీ. జవాన్ సూపర్ సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్లు కావాలంటున్నాడట. మేకర్స్ కూడా ఆ అమౌంట్ ఇవ్వడానికి సిద్దమయ్యారట. పుష్ప తరువాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వెయ్యి కోట్ల వరకు జరుగుతోంది. కాబట్టి అల్లు అర్జున్, అట్లీ కంబోకి నెక్స్ట్ లెవల్లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట మేకర్స్. అందుకే అట్లీకి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారట. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్.. కేవలం దర్శకుడికే రూ.60 కోట్లు ఇస్తున్నారంటే.. హీరోకి ఏ రేంజ్ లో ఇస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.